ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఉపరితల ఆవర్తనం కారణంగా రాయలసీమతో పాటు పరిసర ప్రాంతాలపై ఆవర్తనం కొనసాగుతుందని APSDMA వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. ఈరోజు, రేపు అనంతపురం, కడప, సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, కోనసీమ, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, నంద్యాల, తిరుపతి జిల్లాలలో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే మూడు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ లాంటి మహానగరాలలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లుగా అధికారులు స్పష్టం చేశారు. వర్షంతో పాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళకూడదని అధికారులు వెల్లడించారు.