జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ యూనివర్సిటీలో ఎంఎస్ చదివిన ఓ వ్యక్తి బెంగళూరులో బిక్షాటన చేయడం షాకింగ్ గా మారింది. అక్కడే మైండ్ ట్రీ అనే సంస్థలో పని చేసిన సదరు వ్యక్తి బెంగళూరులో తాజాగా బిక్షాటన చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎక్స్ వేదికగా ‘కర్నాటక పోర్ట్ఫోలియో’ ఈ వీడియోను షేర్ చేసింది. తల్లిదండ్రులు, గర్ల్ ఫ్రెండ్స్ కోల్పోవడంతో సైకలాజికల్ ట్రామాతో వ్యక్తి బాధపడుతున్నట్లు తెలిసింది.
వీడియోలో ఆ వ్యక్తి మాట్లాడుతూ.. ‘2013లో ఫ్రాంక్ ఫర్ట్లో చదివాను. తర్వాత బెంగళూరు వచ్చాను. గ్లోబల్
విలేజ్లో పనిచేశాను. తర్వాత నా తల్లిదండ్రులను కోల్పోయాను.’ అని తెలిపాడు. సోషల్ మీడియాలో
ఈ వీడియోకు వ్యూస్ పెరగడంతో పాటు వైరల్గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ‘ప్లీజ్ అతని
ట్రీట్ మెంట్కు సాయం చేయండి.’ అంటూ కోరుతున్నారు.