బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు వాతలు పెట్టాలి : సీఎం రేవంత్ రెడ్డి

-

కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేయడం లేదంటున్న బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు వాతలు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు సీఎం రేవంత్ రెడ్డి. రూ.500కే సిలిండర్ ఇస్తున్నా.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. పాలమూరు జిల్లా అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమైందని తెలిపారు. పేదల గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని తెలిపారు. 

రాబోయే 20 ఏళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటాడనే భయంతో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అబద్దాలు చెబుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ రైతులను మభ్య పెట్టాలని చూస్తున్నాయని తెలిపారు. కోట్లాది మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించింది నిజం కాదా..? అని ప్రశ్నించారు. కోటీ మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. పాలమూరు కోసం కాంగ్రెస్ ఎన్నో ప్రాజెక్టులు నిర్మించిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news