ముమ్మాటికి కేసీఆర్ పాలమూరు ద్రోహి.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరును ఆగంపట్టించిండు అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వనపర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రైతులకు రుణమాఫీ చేశామన్నారు. పేదలను ఏనాడైనా కేసీఆర్ పట్టించుకున్నారా..? ఎస్ఎల్బీసీ కారణం బీఆర్ఎస్ అన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్, బీజేపీ ఏం చేశాయి అని ప్రశ్నించారు. ఓవర్వేలక బీఆర్ఎస్, బీజేపీ ఆరోపణలు చేస్తున్నాయని తెలిపారు.
మొట్టమొదటి తెలంగాణ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు పాలమూరు బిడ్డ అని మరిచిపోకు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదింది చిన్నారెడ్డి అని మరిచిపోకు. పాలమూరు ప్రాజెక్ట్ లు కేసీఆర్ పదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదన్నారు. వనపర్తితో నాకు ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. పదేళ్లో కేసీఆర్ ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చారా..? అని ప్రశ్నించారు. పాలమూరు బిడ్డలు వలసలు పోతుంటే ఏనాడైనా కేసీఆర్ పట్టించుకున్నాడా..? అని నిలదీశారు. మీ హరికథలు, పిట్ట కథలు నడవవు కేసీఆర్ అన్నారు.