అయోధ్య రామయ్యను దర్శించుకునేందుకు తెలంగాణ ప్రజలకు రాష్ట్ర బీజేపీ రైళ్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 29వ తేదీ నుంచి రాష్ట్రం నుంచి అయోధ్యకు ఆస్తా రైళ్లను నడపాలని నిర్ణయించింది. పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా అయోధ్యకు భక్తులను తరలించనుంది. పార్లమెంట్ పరిధిలోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 200 మందికి అవకాశం కల్పించనున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. అయోధ్యకు వెళ్లి రావడానికి 5 రోజుల సమయం పట్టనుంది. ప్రతి భోగికి ఒక ఇంఛార్జిని నియమిస్తోంది. ఒక్కో రైల్ లో 20 బోగీలు కాగా 14 వందల మందికి అవకాశం ఉంటుంది.
అయోధ్యకు వెళ్లే రైళ్ల షెడ్యూల్‌ను బీజేపీ ప్రకటించింది. ఈ నెల 29న సికింద్రాబాద్, 30న వరంగల్, 31న హైదరాబాద్, ఫిబ్రవరి ఒకటిన కరీంనగర్, రెండున మల్కాజ్ గిరి, మూడున ఖమ్మం, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, ఏడున నిజామాబాద్, 8న ఆదిలాబాద్, 9న మహాబూబ్ నగర్, పదిన మహబూబాబాద్, 11న మెదక్, 12న భువనగిరి, 13న నాగర్ కర్నూల్, 14న నల్గొండ, 15న జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన రైళ్లను పంపించనుంది. సికింద్రాబాద్, కాజీపేట నుంచి రైళ్లు ప్రారంభంకానున్నాయి.