కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ మరో శ్రీలంకగా మారుతుంది: బండి సంజయ్

-

తెలంగాణ బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందే అని ప్రజలు అనుకున్నారని.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని.. గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా రెపరెపలాడిస్తాం అని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన, అవినీతి పాలన కొనసాగుతుందని విమర్శించారు. పేదల భూములు లాక్కుంటూ, ధరణి అనే ముదునష్టపు వ్యవస్థతో పేదలను టీఆర్ఎస్ ప్రభుత్వం అరిగోసపెడుతోందని అన్నారు. భూమి, ఇసుక, గ్రానైట్, డ్రగ్స్ మాఫియాలకు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డాగా మార్చారని విమర్శించారు. తెలంగాణలో ప్రధాన శాఖలు అన్ని కేసీఆర్ కుటుంబ సభ్యుల దగ్గరే ఉన్నాయని.. ఇదే విధంగా కుటుంబ పాలన చేస్తే తెలంగాణ మరో శ్రీలంక అవుతుందని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరును సస్యశ్యామలం చేస్తామని పాలమూరు గడ్డపై హామీ ఇచ్చామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి చేతకాకుంటే ఆర్డీఎస్ ద్వారా నీళ్లిచ్చే బాధ్యతను బీజేపీ తీసుకుంటుందని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తుగ్లక్ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే పెట్రోల్, డిజిల్ పై వ్యాట్ తగ్గిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version