తెలుగు రాజకీయాలు మలుపు తిప్పిన మహావ్యక్తి ఎన్టీఆర్: బండి సంజయ్

-

తెలుగు జాతి గర్వంచదగ్గ మహానటుడు పద్మశ్రీ నందమూరి తారకరామారావు గారని… తెలుగు రాష్ట్రాల రాజకీయాలను మలుపుతిప్పిన మహా వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. పౌరాణికం మొదలు జానపదం, జేమ్స్ బాండ్ సినిమాల వరకు అన్ని రకాల పాత్రలు పోషించి తెలుగు సినిమా రంగాన్ని ఐదు దశాబ్దాలపాటు ఉర్రూతలూగించిన మహానటుడని అన్నారు. తెలుగు జాతి గర్వంచదగ్గ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేసి 80వ దశకంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాలనే మలుపు తిప్పిన నాయకుడు ఎన్టీఆర్ అని తెలిపారు. ఎన్టీఆర్ ప్రారంభించిన రూ. 2 కిలో బియ్యం వంటి సంక్షేమ పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని అన్నారు. ఎన్టీఆర్ జ్ఝాపకాల గుర్తుగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఘాట్ ను కూల్చేస్తామని మజ్లిస్ వంటి కుహానాశక్తులు గతంలో కుట్రలు చేయడం హేయనీయం. ఎన్టీఆర్ ఘాట్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని బండి సంజయ్ అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version