హైదరాబాద్ మరో పాకిస్థాన్ కావొద్దంటే మాధవీ లత గెలవాలి !

-

హైదరాబాద్ మరో పాకిస్థాన్ కావొద్దంటే మాధవీ లత గెలవాలంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్. తాజాగా మీడియాతో బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ మాట్లాడారు. హైదరాబాద్ మరో పాకిస్థాన్ కావొద్దు.. అలా కాకుండా ఉండాలంటే బీజేపీ అభ్యర్థి మాధవీ లతను గెలిపించాలన్నారు బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్.

BJP candidate Madhavi Lata must win otherwise said BJP MP Navneet Kaur

హిందూవులు, ముస్లింలు అందరూ కలిసి…బీజేపీని గెలిపించాలని వెల్లడించారు. గాలిపటం పార్టీ తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఒవైసీ బ్రదర్స్ ను టార్గెట్ చేస్తూ…గతంలో 15 నిమిషాల్లో తరమికొడతామంటూ అక్బరుద్దీన్ చేసిన కామెంట్లకు ఆమె కౌంటరిచ్చారు. 15 నిమిషాలు కాదు 15 సెకన్లలో అడ్రస్ లేకుండా చేస్తామంటూ నవనీత్ కౌర్ వ్యాఖ్యలు చేశారు. కాగా.. హైదరాబాద్‌ ఎంపీగా బీజేపీ నుంచి మాధవీ లత బరిలో ఉన్నారు. ఎంఐఎం తరఫున ఓవైసీ ఉన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news