డీ లిమిటేషన్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ పోరు.. బీజేపీ రియాక్షన్ ఇదే

-

తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీ-లిమిటేషన్‌పై తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. పునర్విభజన పారదర్శనకంగా జరగాలని డిమాండ్ చేశారు. జనాభా కాకుండా.. రాష్ట్రాన్నియూనిట్ గా తీసుకుని నియోజక వర్గ పునర్విభజన చేయాలని కోరారు. అయితే ఈ తీర్మానంపై బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ స్పందించారు. శాసనసభలో డీలిమిటేషన్ పై చర్చిస్తామంటే అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. దీనిపై కలిసి పోరాడతామని బీఆర్ఎస్, కాంగ్రెస్ అంటున్నాయని.. ఇప్పుడు కొత్తగా కలవడం ఏంటి.. ఆ రెండు పార్టీలు ఎప్పుడో కలిసిపోయాయని వ్యాఖ్యానించారు.

“మరికొన్ని రోజుల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ డీలిమిటేషన్ పై చర్చ మొదలుపెట్టారు. కానీ మన రాష్ట్రంలో ప్రస్తుతానికి ఎన్నికలేం లేవు. ఎన్నో సమస్యలు ప్రజలను పీడిస్తున్నాయి. ఇక్కడ ప్రజల కోసం పని చేయాల్సింది పోయి సీఎం రేవంత్ తమిళనాడుకు వెళ్లారు. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు. బీజేపీకి దేశంలోని అన్ని ప్రాంతాలు సమానమే. జిల్లాలను విభజించిన విషయం బీఆర్ఎస్ మరిచిపోయింది.” అని పాయల్ శంకర్ అన్నారు. ఇక అసెంబ్లీలో డీ లిమిటేషన్ పై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బీజేపీ వ్యతిరేకించింది.

Read more RELATED
Recommended to you

Latest news