దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉండటం గర్వకారణం : కేటీఆర్

-

భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సహకరిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ అతిపెద్ద భాగస్వామిగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో టాప్ 5లో తెలంగాణ ఉండటం మన అందరికీ గర్వకారణం అని తెలిపారు. భారతజాతి నిర్మాణంలో మనం పాలుపంచుకుంటున్నామని పేర్కొన్నారు. దేశజనాభాలో 2.8 శాతం ఉన్న తెలంగాణ.. దేశ జీడీపీలో 5.1 శాతం సహకరిస్తోందని వెల్లడించారు. 2041లో రీచ్ అవాల్సిన ITIR తెలంగాణ 2022లోనే దాటిందని.. దట్ ఈజ్ తెలంగాణ అని కేటీఆర్ అన్నారు.
“పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసింది. కానీ మాకు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటు కూడా రాలేదు. రాలేదని అందరూ సంబురపడ్డారు, ఎద్దేవా చేశారు. మరి కాంగ్రెస్, బీజేపీ చెరో 8 సీట్లు సాధించాయి. కానీ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తెచ్చింది గుండు సున్నా. 16 ఎంపీ సీట్లు ఉండి ఈ రెండు పార్టీలు రాష్ట్రానికి చేసింది ఏంటి..? తెచ్చింది ఏంటి..? అని అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ ప్రశ్నించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news