బిజెపి, కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు: మంత్రి హరీష్ రావు

-

బిజెపి, కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఒకవేళ అధికారంలోకి వచ్చినా అరచేతిలో వైకుంఠం చూపిస్తారని పేర్కొన్నారు. నారాయణపేట జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన డయాలసిస్ యూనిట్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి గతంలో నాగం జనార్ధన్ రెడ్డి, డికె అరుణ మంత్రులుగా పనిచేశారు. కానీ ఒక్క మెడికల్ కాలేజీ కూడా సాధించలేకపోయారని అన్నారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం మొత్తం నాలుగు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిందన్నారు. కర్ణాటకలో రైతులకు కనీసం ఆరు గంటల పాటు కరెంటు ఇస్తున్నారా? అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణలో మాత్రం 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ను అందిస్తున్నామని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు సరిపడా విద్యుత్ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. బండి సంజయ్ పాదయాత్ర చేస్తాను అంటే ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version