బీజేపీ పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తుంది: మంత్రి నిరంజన్ రెడ్డి

-

భారత దేశాన్ని పరిపాలించే ఏ ప్రభుత్వమైనా రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కానీ కేంద్రంలోని బిజెపి సర్కారు మాత్రం దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తోంది అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.పెట్టుబడిదారుల ప్రయోజనాలకు కొమ్ము కాస్తూ వ్యవసాయాన్ని క్రమంగా కార్పొరేట్ శక్తులపరం చేసేందుకు కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.మాదాపూర్ హెచ్ఐసీసీలో జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీ లో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందించే తీర్మానాన్ని మంత్రి ప్రవేశపెట్టారు. దీనికి గంగుల కమలాకర్ మద్దతు తెలిపారు.

మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..వ్యవసాయిక దేశమైన భారత దేశాన్ని పరిపాలించే ఏ ప్రభుత్వమైనా రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.ప్రస్తుతం దేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది.పెట్టుబడిదారుల ప్రయోజనాలకు కొమ్ము కాస్తూ వ్యవసాయాన్ని క్రమంగా కార్పొరేట్ శక్తుల పరం చేసేందుకు కుట్రలు చేస్తున్నది అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version