అల్లు అర్జున్ హీరోగా రేపు అభిమానుల ముందుకు రాబోతున్న పుష్పా 2 సినిమా పై ఆర్మూర్ బీజేపీ MLA రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. పుష్ప సినిమాలో చూపించేది అంతా కల్పితం, ఈ విషయాన్ని దర్శకుడు, హీరో పత్రికా ప్రకటన ద్వార ప్రజలకు నిజం చెప్పాలి. పుష్ప సినిమాతో ఆంధ్రప్రదేశ్ లో సగం అడవి ధ్వంసం అయ్యింది. పుష్ప 2 తో మరింత నాశనం అవుతుంది. పుష్ప సినిమా సన్నీ వేషాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించాలి. అసలు పుష్ప 2 సినిమా ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం.
నేను లైసెన్స్ ఎర్ర చెందన వ్యాపారస్తున్ని, ఎర్ర చందనం 10 లక్షలు ఉంటే 1 కోటి అని చూపిస్తున్నారు. పుష్ప సినిమా చూసి లక్షల్లో చెట్లు నరికేశారు. పుష్ప 2తో ఇంకా ఎన్ని చెట్లు నరికివేస్తారో? అడవిని ధ్వంసం చేసేలా సన్నీ వేషాలు దృరదృష్టకరం. అలాగే పుష్ప 2 సినిమా టికెట్ల ధరలు అమాంతంగా పెంచడం దారుణం. నేను పుష్ప సినిమా చూశాను. పుష్ప 2 OTT లో చూస్తాను.. థియేటర్ లో చూడను అని MLA రాకేష్ రెడ్డి అన్నారు.