తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఎద్దుల బండిపై అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు వచ్చారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి ఎడ్ల బండ్లపై బయలుదేరారు బీజేపీ ఎమ్మెల్యేలు. రైతు సమస్యలపై అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం నిరాకరిస్తుందంటూ బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఇక అటు అసెంబ్లీకి ఆకు పచ్చ కండువాలతో BRS MLAలు వచ్చారు. రైతాంగ సమస్యలపై రైతు కండువాలు వేసుకొని అసెంబ్లీలోకి వెళ్తున్నారు BRS ఎంఎల్ఏ లు. రైతు రుణమాఫీ, రైతు భరోసా , బోనస్ పై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఎద్దుల బండిపై అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి ఎడ్ల బండ్లపై బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలు
రైతు సమస్యలపై అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం నిరాకరిస్తుందంటూ బీజేపీ ఎమ్మెల్యేల నిరసన#Telangana #Hyderabad #BRS #KTR #Congress #RevanthReddy #BJP… pic.twitter.com/P42M5ElrvJ
— Telugu Galaxy (@Telugu_Galaxy) December 19, 2024