మంత్రి పదవికి అమిత్ షా రాజీనామా చేయాలి – షర్మిల

-

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు షర్మిల. బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనం అంటూ ట్వీట్‌ చేశారు. భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానం అని ఫైర్‌ అయ్యారు. దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసినట్లేనన్నారు.

Sharmila-on-Amit-Shah

అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని అమలు చేసేందుకు సంఘ్ పరివార్ కుట్రలో భాగమే ఇదంతా. మనుస్మృతిని బీజేపీ విశ్వసిస్తుంది కాబట్టే అనుక్షణం రాజ్యాంగంపై దాడి చేస్తోంది. రాజ్యాంగ నిర్మాతను ప్రతి సారి హేళన చేస్తోంది. మన రాజ్యాంగం మీద, మన జాతీయ జెండా మీద బీజేపీకి గౌరవం లేదని మరోసారి నిరూపితం అయ్యింది. అంబేద్కర్ ను అవమానించినందుకు అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాడ్‌ చేశారు. మంత్రి పదవికి తక్షణం రాజీనామా చేయాలన్నారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా AICC పిలుపు మేరకు ఇవ్వాళ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం చేయాలని కోరుతున్నానని తెలిపారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news