కాంగ్రెస్ అధికారంలోకి వస్తామని ఇచ్చిన హామీలు కావు అవి అని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. అలాగే మూసికి అటు ఇటు ఉన్న భూములు గుంచుకొని అదానీకి, పెద్ద పెద్ద కంపెనీలకు కట్టబెట్టాలని సీఎం అనుకుంటున్నారు అని తెలిపారు. దళితులు, పేద రైతుల ఎలా గుంజుకోవాలని తప్ప ఇచ్చిన హామీలు అమలు చేసే దమ్ము లేదు అని.. అందుకే రేవంత్ రెడ్డి 10 నెలల్లోనే అభాసు పాలు అయ్యారు అని పేర్కొన్నారు ఈటల.
ఇక ప్రజలను మరోసారి మోసం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు చేస్తుంది అని ఎంపీ DK అరుణ అన్నారు. ముఖ్యమంత్రిది నోరేనా.. గత ముఖ్యమంత్రిని గద్దె దించిన సోయి లేదా.. కేసీఆర్ తో పోటీ పడి తిడుతున్నారు. అయితే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో రేవంత్ రెడ్డి. ఢిల్లీకి వచ్చి కాగితాలు ఇచ్చి అడుక్కుంటారు.. బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతారు. లక్కీ లాటరీ తగిలి సీఎం అయ్యారు. అప్పుడో కుటుంబ పాలన, ఇప్పుడో కుటుంబ పాలన. కాబట్టి బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాత మారుతుంది అని అరుణ తెలిపారు.