దేశ అభివృద్ధిలో మోడీ విప్లవాత్మక నిర్ణయాలు మోడీ తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఫలాలు కింది స్థాయి ప్రజలకు అందించాలనే తపనతో పాలన కొనసాగిస్తున్నారు అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. పార్టీకి సంస్థాగత నిర్మాణం ముఖ్యమైనది. సంస్థాగత నిర్మాణం పటిష్టంగా ఉన్నందుకే గుజరాత్ లో గత 20 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్నాం. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నాం. అట్లాంటి పటిష్ఠమైన సంస్థాగత నిర్మాణం ప్రతి రాష్ట్రంలో నిర్మాణం జరుగుతుంది. జరగాలి.
ఇక మహారాష్ట్ర, జార్ఖండ్ లో కచ్చితంగా బీజేపే అధికారంలోకి వస్తుంది. అయితే రాహుల్ రాష్ట్రానికి వచ్చి దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మాట్లాడుతున్నారు. కులగణన దేశానికి మోడల్ కాదు చీటింగ్. కాంగ్రెస్ బూటకపు మాటలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సీతా రామ్ కేసరి గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు. కాంగ్రెస్ కు అధ్యక్షులు కావాలంటే నెహ్రూ అనే తొక కావాలి. కానీ బీజేపీలో సామాన్య పౌరుడు అధ్యక్షడు అయ్యే అవకాశం ఉంది. రాజకీయ అవకాశాలు సమానత్వంగా ఇచ్చే ఏకైక పార్టీ దేశంలో బీజేపీ. పదవులు ముఖ్యం కాదు మాకు భాద్యతలు ముఖ్యం. కుర్చీల కోసం కొట్లాడే సంప్రదాయం బీజేపీకి లేదు. కాంగ్రెస్ పాలనలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల పట్ల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. 2040 వరకు వికసిత భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. తెలంగాణలో భవిష్యత్ బీజేపీదేననే లక్ష్యంతో ప్రతి కార్యకర్త ముందుకు వెళ్ళాలి అని ఎంపీ లక్ష్మణ్ సూచించారు.