బండి సంజయ్ అరెస్టుపై హైకోర్టులో బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను కరీంనగర్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సంజయ్ అరెస్టును బీజేపీ నేతలు ఖండించారు. కారణం చెప్పకుండా అరెస్టు చేయడం.. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించడమేనని అన్నారు. ఈ క్రమంలోనే కాషాయ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. బండి సంజయ్ అరెస్టుపై హైకోర్టులో బీజేపీ నేతలు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

మరోవైపు బండి సంజయ్​ను ఉంచిన బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా బీజేపీ శ్రేణులు చేరుకున్నాయి. సంజయ్​ను వెంటనే విడుదల చేయాలంటూ నివాదాలు చేశారు. బండి సంజయ్​కు సంఘీభావం తెలిపేందుకు అక్కడికి వెళ్లిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మరో నేత శ్రీశైలం గౌడ్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బండి సంజయ్ అరెస్టు నేపథ్యంలో అల్లర్లు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ నేతలను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. మెట్​పల్లి, కోరుట్ల, జగిత్యాల, పెద్దపల్లి, పాలకుర్తి, రామగిరి మండలాల్లో ప్రధాన నాయకులను అదుపులోకి తీసుకుంటున్నారు. పదో తరగతి పేపర్ లీకేజీ విషయంపై ఇవాళ బండి సంజయ్ ప్రెస్ మీట్ పెడతారన్న నేపథ్యంలో ఆయణ్ను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version