బీజేపీ నిజస్వరూపం బయటపడింది – విహెచ్ సంచలన వ్యాఖ్యలు

-

బిజెపి, ఆర్ఎస్ఎస్ లపై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి హనుమంతరావు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ కులగణనతో ముప్పు అంటుందన్నారు. కేవలం ఉద్యోగ నియామకాలలో మాత్రమే కులగణన ఉండాలని.. రాజకీయాలలో కులగణన వద్దని ఆర్ఎస్ఎస్ అంటుందన్నారు. కులగణన చేస్తే దేశం మునిగిపోతుందా..? అని ప్రశ్నించారు హనుమంతరావు.

ఆర్ఎస్ఎస్, బిజెపి దేవుళ్ల పేరు మీద రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. రాజకీయ నాయకులు కేవలం ఓట్లు వేసే మిషన్లా..? అంటూ మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలతో బీజేపీ నిజస్వరూపం బయటపడిందన్నారు హనుమంతరావు. దీనికి కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆర్ఎస్ఎస్ చేసిన వ్యాఖ్యలపై బీసీ, ఎస్సీలు యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. కులగనణ చేస్తే 90% మందికి న్యాయం జరుగుతుందన్నారు వీ.హెచ్. అధికారంలోకి వస్తే కుల గణన చేస్తామని రాహుల్ గాంధీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 1930 లో కులగణన జరిగిందని.. దాని తరువాత ఇప్పటివరకు మళ్ళీ కులగణన జరగలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version