వరద బాధిత కుటుంబాలకు నిత్యవసర సరుకులతో పాటు రూ.10వేల నగదు అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాజాగా మహబూబాబాద్ కలెక్టరేట్ లో అధికారులతో రివ్యూ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. వరద నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు వివరించారు. భారీ వర్షాలతో ఆకేరు వరదతో యువ శాస్త్రవేత్త అశ్విని మరణించారు. యువశాస్త్రవేత్త అశ్వని మరణించడం చాలా బాధకరం. ఆమె సోదరుడిని పరామర్శించానని.. ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలిపారు.
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో ఇన్ చార్జీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క ప్రభుత్వ తరపున అన్ని చర్యలు తీసుకుంటారు. వరద బాధితుల కోసం ఇన్ చార్జీ మంత్రి నేరుగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. వరదల్లో కొట్టుకుపోయిన బాధితులకు సంబంధించిన ఏమైనా సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు, పాస్ పుస్తకాలు ఇలా ఏవి కోల్పోయినా వారి వద్ద నుంచి వివరాలను తీసుకొని వాటిని తిరిగి వారికి మళ్లీ ప్రభుత్వం తరపున అందించాలని కలెక్టర్ ను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.