Breaking: మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్ ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు

-

రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్ లోని పైలెట్ వాహనం ప్రమాదానికి గురైంది. కాన్వాయ్ లోని పైలట్ వాహనం ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో 8 ఏళ్ల బాలుడికి రెండు కాళ్లు విరగగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

పూర్తి వివరాలు లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం గ్రామ శివారులలో బుధవారం రాత్రి మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్ ఢీకొని ముగ్గురికి గాయాలు అయ్యాయి. మార్కుక్ మండలం పాతూరు గ్రామానికి చెందిన చందా కనకయ్య, మన్నె బాలరాజు, అతని కొడుకు భాను ప్రసాద్ (8) తో కలిసి బైక్ పై రోడ్డు దాటుతుండగా గజ్వేల్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్ ఢీ కొట్టింది.

దీంతో బాలుడి రెండు కాళ్లు విరిగాయి. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బాధిత బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాధిత కుటుంబసభ్యులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version