బీఆర్ఎస్ – బీజేపీ మధ్య స్నేహబంధం ఉంది – మంత్రి పొన్నం

-

ఢిల్లీలో బీఆర్ఎస్, బిజెపి మధ్య స్నేహబంధం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రైతులకు లాభపడే నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ మాత్రమే తీసుకుంటుందని అన్నారు.

రైతాంగంపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని, బాధ్యతలు అంటే రాజకీయ పదవులు కాదని అన్నారు. 60 వేల కోట్ల మిగులుతో ఏర్పడిన రాష్ట్రం నేడు 7వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని మండిపడ్డారు. వరదలతో పదివేల కోట్లకు పైగా నష్టం జరిగితే కేవలం కేంద్రం ఇచ్చింది 400 కోట్లు మాత్రమే అని అన్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసిఆర్ అసెంబ్లీకి కూడా రావడంలేదని.. గజ్వేల్ లోను కేసీఆర్ ఏ కార్యక్రమాలకు హాజరు కావడం లేదని మండిపడ్డారు.

కేంద్రంలోని బిజెపి తెలంగాణకు సరిగా నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు మంత్రి పొన్నం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నెలకే కూలిపోతుందని వ్యాఖ్యానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి – బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి వ్యవసాయ వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version