ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీ రావు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యస్థాపకుడిగా వారందించిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
- రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు(88) అస్తమయం
- తెల్లవారుజామున 4.50 గం.కు తుదిశ్వాస విడిచిన రామోజీరావు
- హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
- కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు
- ఫిల్మ్‌సిటీలోని నివాసానికి రామోజీరావు పార్థివదేహం తరలింపు