తుంటి ఎముకకు సర్జరీతో గతకొంతకాలంగా ఇంటికే పరిమితమైన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ త్వరలో గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వనున్నారట. తన పుట్టినరోజు అయిన ఫిబ్రవరి 17న కేసీఆర్ మళ్ళీ ప్రజల్లోకి వస్తారని సమాచారం. ఆ రోజే హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ కు రానున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత గజ్వేల్ లో పార్టీ క్యాడర్ తో సమావేశం అవుతారట.
మరోవైపు గులాబీ దశ అధినేతకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఫిబ్రవరి 17 కేసీఆర్ పుట్టిన రోజు ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ భవన్‌కు రానున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇక ఫిబ్రవరి 20 తర్వాత నుంచి గజ్వేల్ క్యాంప్ ఆఫీసులో రెగ్యులర్‌గా ప్రజలకు, క్యాడర్‌కు అందుబాటులో కేసీఆర్ ఉండనున్నట్లు సమాచారం అందుతోంది.