మహారాష్ట్రలో BRS పోటీ చేయడంపై.. మాజీ మంత్రి హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. మేము మహారాష్ట్రలో పోటీ చేయట్లేదని… అక్కడికి వెళ్లి ప్రచారం చేయబోమని తెలిపారు. అందుకే ఇక్కడి నుండే కాంగ్రెస్ మోసాలపై చెబుతున్నామన్నారు. మహారాష్ట్ర లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం కోసం…రేవంత్ రెడ్డి…. తెలంగాణ డబ్బులు వాడుతున్నారని ఆరోపణలు చేశారు.
రేవంత్ రెడ్డి…. మహారాష్ట్రకి వెళ్లి అబద్దాలు ఆడుతున్నాడని ఆగ్రహించారు మాజీ మంత్రి హరీష్ రావు. వరి పంటకు బోనస్ రూ. 500 ఇస్తున్న అన్నాడు.. ఎక్కడ ఇస్తున్నాడని నిలదీశారు. రైతులకు ఇచ్చిన హామీలు సంపూర్ణంగా ఒక్కటి కూడా అమలు చేయలేదు.. మహారాష్ట్రకు వెళ్లి రేవంత్ రెడ్డి హామీలు చేశామని అబద్ధాలు అంటున్నాడని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి తన అబద్ధాల ప్రవాహాన్ని మహారాష్ట్ర లో కొనసాగించారు… ఆరు గ్యారంటీ లు ఇచ్చి అమలు చేయకుండా తెలంగాణ లో మోసం చేశారని ఫైర్ అయ్యారు.