కాలేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ నాశనం చేసింది – మంత్రి ఉత్తమ్

-

నేడు ములుగు జిల్లా కన్నాయిగూడెం దేవాదుల ప్రాజెక్టును సమీక్షించారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు కీలకమైన దేవాదుల ప్రాజెక్టును 2026 మార్చ్ నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రతి ఎకరాకు నీరు అందించాలన్నదే తమ లక్ష్యం అని తెలిపారు.

బిఆర్ఎస్ పార్టీ కాలేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా నాశనం చేసిందని మండిపడ్డారు ఉత్తమ్. గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖలో కోట్ల అవినీతి జరిగిందని విమర్శించారు. దేవాదుల నుంచి 300 రోజులు 60 టీఎంసీలు ఎత్తిపోసామని.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టులు నత్తనడకన సాగాయని.. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు.

2004 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దేవాదులకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి వరంగల్ సహా కరీంనగర్, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలలోని ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రస్తుతం మూడు లక్షల 17వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుండగా.. మూడోదశ పూర్తి అయితే మరో రెండు లక్షల నలభై వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news