తప్పుడు ప్రచారంతో బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని మంత్రి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం ఆంధ్రాకు వాటర్ ని తరలించుకుపోవడానికి అన్ని విధాలుగా సహకరించిందన్నారు. కేఆర్ఎంబీకీ కేసీఆర్ ప్రాజెక్టులు అప్పగించి బడ్జెట్ లో నిర్వహణ వ్యయాన్ని కేటాయించారు.
గ్రావిటీ ద్వారా మనకు రావాల్సిన 8 టీఎంసీల జలాలను కేసీఆర్ ప్రభుత్వం వదులుకుందన్నారు. కేసీఆర్, జగన్ కుట్ర పూరితంగా వ్యవహరించారు. అబద్దపు ప్రచారం చేస్తూ ఉన్నారు. రూ.527 కోట్లు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించారు. కానీ ఎకరానికి నీళ్లు ఇవ్వలేదన్నారు. రాయలసీమ లిప్ట్ కి సహకరించేందుకు అపెక్స్ సమావేశానికి హాజరు కాలేదు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పదేళ్ల పాటు పక్కకు పెట్టారు. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ నేతలు బ్లాక్ మెయిల్ చేశారు. హరీశ్ రావు మాట్లాడే మాటలు అబద్దాలేనని తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.