ఫేక్ వీడియోలు వైరల్ చేసిన బీఆర్ఎస్ ఐటి సెల్.. కేసు నమోదు

-

బీఆర్ఎస్ ఐటీ సెల్ పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. HCU లో ఆందోళనల వేళ నకిలీ వీడియోలు వైరల్ చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ చార్జీ దిలీప్ క్రిశాంక్ పై కేసు నమోదు అయింది. 353, 353 (2), 192, 196(1), 61(1)(a) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. HCU అధికారులను సంప్రదించకుండా ఉద్దేశపూర్వకంగా నకిలీ వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో పోస్టు చేసినట్టు పోలీసులు గుర్తించారు. 

BRS

ప్రజల్లో అశాంతి రేపేలా, రెచ్చ గొట్టేలా ఇన్ స్టా గ్రామ్, ఎక్స్ లో పోస్టులు వైరల్ చేశారని పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు. మరోవైపు కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటాగా కేసు స్వీకరించిన ధర్మాసనం.. ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దంటూ స్టే విధించింది. మూడు రోజుల వ్యవధిలో వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిని చాలా సీరియస్ అంశంగా పరిగణించింది.

Read more RELATED
Recommended to you

Latest news