తెలంగాణ ఉద్యోగాలు ఆంధ్ర వారికి ఇస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. నిన్న హైదరాబాద్ లో ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు… సింగరేణి ఉద్యోగాల డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. 20 వేల నియామకాల డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తోంది..జనరల్ మేనేజర్ స్థాయిలో ఇవ్వాల్సిన ఉద్యోగాలు, హైదరాబాద్ లో CM లాంటి వాళ్ళు ఇవ్వటం సిగ్గు చేటు అంటూ మండిపడ్డారు.
తెలంగాణ లో కరెంట్ కోతలు మొదలయ్యాయని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆంధ్ర వాళ్ళని డైరెక్టర్ లను నియమించారు…తెలంగాణ కు నిరంతర కరెంట్ ఇవ్వటం లో వీళ్ళు ఎంత భాగస్వామ్యం అవుతారని నిలదీశారు. మీలో పచ్చ రక్తం పారుతుంది కాబట్టే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని నిప్పులు చెరిగారు. తెలంగాణ అసెంబ్లీకి ఆంధ్ర అడ్వైసర్ ఎందుకు? అంటూ సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ ఉద్యోగాలు ఆంధ్ర వారికి ఇస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేశారు.