కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఈ సందర్భంగా తెలంగాణ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై చర్చ జరుగనుంది. అభిప్రాయ సేకరణలో వచ్చిన పేర్లపై చర్చ ఉంటుంది. అటు త్వరలోనే పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించనుంది బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ. ఈ నెల 16 లోపే తెలంగాణ ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉంది.
17 స్థానాల్లో మెజారిటీ స్థానాల్లో అభ్యర్థుల పేర్లు మొదటి జాబితా లోనే ఉండే అవకాశం ఉంది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీం నగర్ నుంచి బండి సంజయ్ బరిలో ఉంటారని సమాచారం. నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, చేవెళ్ల నుంచి కొండ విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, మహబూబ్ నగర్ నుంచి డికే అరుణ బరిలో ఉంటారు.
పెద్దపల్లి, మహబూబ్ బాద్ లలో కాంగ్రెస్ నేతల ను బీజేపీ లో చేర్చుకొని టికెట్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నది బీజేపీ పార్టీ. నాగర్ కర్నూలు, వరంగల్, జహీరాబాద్, అదిలాబాద్ లలో BRS నేతల పై కన్ను పడిందని సమాచారం. మల్కాజ్ గిరి,మెదక్, హైదరాబాద్ లలో ఎవరిని బరిలోకి దించాలని నిర్ణయం కేంద్ర ఎన్నికల కమిటీ దేనని సమాచారం.