బిఆర్ఎస్ కీలక నిర్ణయం.. రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

-

మరికాసేపట్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం ఎదుట దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. తెలంగాణ ఇచ్చినందుకు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు, అమర జ్యోతి పక్కన ఆవిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది.

దీన్ని రాజీవ్ గాంధీ జయంతి నాడే ఆవిష్కరించాలని అనుకున్నారు. కానీ కుదరలేదు. దీంతో ఈరోజు ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే సచివాలయం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడాన్ని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. రాజీవ్ గాంధీ విగ్రహానికి బదులుగా ఆ ప్రదేశంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపాదించినట్లు బిఆర్ఎస్ చెబుతుంది.

దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారితీసింది. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ రేపు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిద్ధమైంది. రేపు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version