బాలాపూర్ లడ్డు వేలంలో ఈసారి కొత్త రూల్..!

-

వినాయకుడి పండుగను హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. నవరాత్రి ఉత్సవాలను దేశవ్యాప్తంగా వాడవాడలా వైభవంగా నిర్వహిస్తుంటారు. వినాయకుడిని నిలబెట్టిన తరువాత నిమజ్జనం వరకు పూజలు చేస్తారు. ఎవ్వరికీ వీలును భట్టి వారు నిమజ్జనం చేస్తారు. మన తెలుగు ప్రజలు మాత్రం వినాయకుడిని నిమజ్జనం రోజు రెండు వినాయకుల సమాచారం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.

అది ఒకటి ఖైరతాబాద్ నిమజ్జనం, రెండు బాలాపూర్ గణేషుడి లడ్డు. బాలాపూర్ లడ్డుకు అంతటి ప్రత్యేకత ఉంది మరీ. 1994లో బాలాపూర్ లడ్డు వేలం ప్రారంభం అయింది. అప్పట్లో కొలను మోహన్ రెడ్డి రూ.450కి కొనుగోలు చేశారు. బాలాపూర్ గణేషుడి మహిమ కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. తొలి 17 సంవత్సరాలు కేవలం బాలాపూర్ గ్రామస్తులకు మాత్రమే లడ్డు వేలం పాట పాడే అవకాశం ఉండేది. ఆ తరువాత ఎవరైనా లడ్డు వేలం పాట పాడే అవకాశం కల్పించారు. అప్పటి నుంచే బాలాపూర్ లడ్డుకు క్రేజ్ పెరిగింది. ప్రతీ ఏడాది పెరుగుతూ వచ్చింది. 2023లో రూ.27లక్షలకు దయానంద్ రెడ్డి వేలం పాటలో దక్కించుకున్నాడు. అయితే ఈసారి వేలంపాటలో కొత్త రూల్ ను తీసుకొచ్చారు.  ఇప్పటి వరకు లడ్డు వేలం పాట పాడేందుకు డిపాజిట్ చేసేవారు. కానీ ఇప్పుడు  వేలానికి ముందు రోజే ఇవాళ రాత్రి వరకు  రూ.27లక్షలు డిపాజిట్ చేసిన వారికే వేలం పాటలో అవకాశం ఉంటుంది. గత ఏడాది రూ.27లక్షలు కాబట్టి.. 27 లక్షలు డిపాజిట్ నిర్ణయించారు. వచ్చే ఏడాది అధికమైతే.. ఆ ధరను మళ్లీ డిపాజిట్ చేసి పేరు నమోదు చేసుకొని వేలంపాటలో పాల్గొనాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version