మహారాష్ట్ర సదన్ లో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్ 3వ జాతీయ సదస్సు జరిగింది. కుల గణన, మహిళల హక్కులు రిజర్వేషన్లు సామాజిక న్యాయం యొక్క స్తంభాలు అనే అంశం పై చర్చించారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ఉన్న బిసి,ఓబీసీ నేతలు, ఎంపీలు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి సదస్సులో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
అక్కడ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో 60శాతం ఉన్న ఓబీసీలను అన్యాయం జరుగుతుంది. దేశ ప్రధాని ఓబీసీ..అయినా బీసీలకు న్యాయం జరగడం లేదు. దేశానికి బిసి ప్రధానిగా ఉన్నా బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు సీబీయాలి. బిసిల ఓట్లు తీసుకుని ప్రభుత్వం లోకి వచ్చాక వారిని పట్టించుకోవడం లేదు. తెలంగాణ లో కేవలం ఇద్దరే బిసి మంత్రులు ఉన్నారు. ఖాళీగా ఉన్న మంత్రిత్వ శాఖలకు అయినా బిసి మైనారిటీలకు ఇవ్వాలి. కులగణనలో బిసి గణన జరగాలి. కులగణన దేశవ్యాప్తంగా జరగాలి. తెలంగాణ లో జరుగుతున్న కులగణన పట్ల ప్రజలు భయపడుతున్నారు. కులగణనకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు అని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.