రాష్ట్ర సమస్యలను ప్రధాని దృష్టికి సీఎం తేవడం సంతోషకరమని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ అన్నారు. కేంద్ర నిధుల విషయంలో గత ప్రభుత్వం తాత్సారం చేసిందని భట్టి విక్రమార్క ఆరోపించడం సమంజసం కాదని మండిపడ్డారు. కేంద్ర నిధులు రాబట్టడంలో విఫలమైనట్లు విమర్శించారని.. రాష్ట్ర సమస్యలపై బీఆర్ఎస్ హయాంలోనూ ప్రధానిని కలిసి వివరించామని స్పష్టం చేశఆరు. విభజన చట్టం హామీల విషయమై కేంద్రానికి పలుమా ర్లు లేఖలు రాశామని.. కేసీఆర్ కూడా పలుమార్లు ప్రధానిని కలిసి వివరించినా స్పందన లేదని చెప్పారు.
“రాష్ట్ర అంశాలపై కేంద్రం నుంచి సరైన స్పందన లేదు. తెలంగాణలో సగటు జాతీయరహదారులు కూడా లేవని చెప్పాం. మేము ఎంపీలుగా ఉన్నప్పుడు కూడా జాతీయ రహదారుల మంజూరు కోసం కొట్లాడాం. తెలంగాణలో చాలా వరకు జాతీయరహదారులు సాధించాం. రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం బీఆర్ఎస్ ఎన్నడూ కేంద్రం వద్ద రాజీ పడలేదు. తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోదీ ప్రతిసారి అన్యాయం చేశారు. మేము గతంలో రాసిన లేఖలు, ఇప్పుడు కాంగ్రెస్ రాసిన లేఖలు అన్నింటి సారాంశం ఒకటే. ఇంకా చాలా సమస్యలను సీఎం, డిప్యూటీ సీఎం ప్రధానికి చెప్పలేదు.” అని వినోద్ కుమార్ అన్నారు.