ఎమ్మెల్యే బాలకృష్ణ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్వాడీ కార్యకర్తలు

-

వేతనాలు పెంచాలని ఏపీలో అంగన్వాడీలు గత పదహారు రోజులుగా సమ్మె చేస్తున్నారు. రోజు రోజుకు సమ్మె ఉధృతం అవుతుండడంతో ఎట్టకేలకు ప్రభుత్వం అంగన్వాడీలను చర్చలకు పిలిచింది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు వెలగపూడి లోని రాష్ట్ర సచివాలయంలో అంగన్వాడీ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు జరిపింది. కానీ ఈ చర్చలు విఫలం అయ్యాయి. జీతాల పెంపు సాధ్యం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. మాది మహిళా పక్షపాత ప్రభుత్వమని, వేతనాల పెంపుకు కొంత సమయం కావాలని అడిగామని.. సంక్రాంతి తర్వాత దీనిపై చర్చిస్తామని బొత్స పేర్కొన్నారు.

అయితే జీతాలు పెంచకుంటే సమ్మెను విరమించేది లేదని అంగన్వాడీ సంఘాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలోనే నేడు ఎమ్మెల్యేల ఇళ్ళ ముట్టడికి పిలుపునిచ్చాయి అంగన్వాడి సంఘాలు. దీంతో హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు అంగన్వాడి కార్యకర్తలు. బాలకృష్ణ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు. తమ సమ్మెకు బాలకృష్ణ సంఘీభావం తెలపాలని డిమాండ్ చేశారు. వేతనాల పెంపుతో పాటు మెడికల్ లీవులు కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news