తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పలు కీలక మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇటీవలే డీఎస్సీ అభ్యర్థులు, గ్రూపు 2 పరీక్షలు యథాతథంగా జరుగుతాయని తొలుత ప్రకటించారు. ప్రకటించిన మాదిరిగానే డీఎస్సీ పరీక్షలు జరగుతున్నాయి. కానీ గ్రూపు 2 పరీక్షలు వాయిదా వేసినట్టు నిన్న శుక్రవారం ప్రకటించారు.
తాజాగా కోఠిలోని ఆరోగ్య, వైద్య, విద్యా కమిషనరేట్ లో హైడ్రామా చోటు చేసుకుంది. ప్రభుత్వ స్టాఫ్ నర్స్, హెడ్ నర్స్, జనరల్ ట్రాన్స్ ఫర్ లో గందరగోళం చోటు చేసుకుంది. ప్రియారిటి ట్రాన్స్ఫర్స్ & ఆప్షన్ ఫామ్ లేకుండానే ప్రభుత్వ వైద్య సిబ్బంది బదిలీ చేస్తున్నారు అధికారులు. పారదర్శకత లేకుండా తమను బదిలీ చేస్తున్నారంటూ స్టాఫ్ నర్స్, హెడ్ నర్స్ ఆందోళన చేస్తున్నారు. బదిలీలు గందరగోళానికి గురి కావడంతో చేతులెత్తేసారు వైద్య, విద్య, కుటుంబ సంక్షేమ కమిషనర్. బదిలీల ప్రక్రియ ఈ నెల 21 వ తేదీ చివరి అవకాశం కావడంతో గందరగోళం నెలకొంది.