Kaushik Reddy: అసెంబ్లీకి ఆటోలో వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి

-

Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మరోసారి హాట్‌ టాపిక్‌ గా నిలిచారు. ఇవాళ అసెంబ్లీకి ఆటోలో వెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి. ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు అసెంబ్లీకి ఆటోలో వెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

ఇక ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్‌ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ…ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లో ఆటో వాళ్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. అది తెలిసే నేను ఈరోజు అసెంబ్లీ కి ఆటో లో వచ్చానని వివరించారు.

కానీ ఆటో లోపలికి అనుమతి ఇవ్వలేదని ఫైర్‌ అయ్యారు.
ఎమ్మెల్యే అంటే కారులోనే రావాలని ఏమైనా రూల్ ఉందా…ఆటో రానివ్వక పోవడం తో నేను నడుచుకుంటూ లోపలికి వచ్చానన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి.నేను ఎమ్మెల్యేను..నన్ను ఎందుకు ఆటో లో అసెంబ్లీ కి రానివ్వరు చెప్పాలి…ఆటో డ్రైవర్ లకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news