కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు నమ్మక ద్రోహం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అంటేనే మోసమని, ఆ పార్టీ ప్రజలకు నమ్మకద్రోహం చేసిందని మండిపడ్డారు.
పదేళ్లలో తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌దేనని మల్లారెడ్డి అన్నారు. నమ్మకం అంటే కేసీఆర్ అని, విశ్వాసం అంటే కేటీఆర్ అని, భరోసా అంటేనే బీఆర్‌ఎస్ అని తెలిపారు. రాష్ట్రంలో 10 నుంచి 12 ఎంపీ సీట్లను గెలుస్తామని, నాయకులు బీఆర్‌ఎస్‌ను వీడినా.. పార్టీకి నష్టం లేదని, కార్యకర్తలు బలంగా ఉన్నారని చెప్పారు. ఈటల బీఆర్‌ఎస్‌ను మోసం చేసి బీజేపీలో చేరారని విమర్శించారు. మరోవైపు మల్కాజిగిరి బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ 25 ఏళ్లుగా ప్రజల మధ్య ఉండి సేవ చేస్తున్నానని, అధిక మోజార్టీతో గెలిపించాలని శ్రేణులను కోరారు.