పార్టీ మారడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు గులాబీ పార్టీ మారడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కీలక వ్యాఖ్యలు చేసారు. నాకు నిధులు అవసరం, ఆలోచిస్తున్నా.. అభివృద్ధి చేస్తే దేనికైనా సిద్ధం అంటూ వెల్లడించారు.
నియోజకవర్గ సమస్యలపై రేవంత్ రెడ్డిని కలిశా.. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొంటానని చెప్పారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రితో టచ్‌లో ఉంటానని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో టచ్‌లో లేను అని చెప్పారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. భవిష్యత్ పరిణామాలను బట్టి పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.