బ్లాక్ షర్టులతో అసెంబ్లీకి BRS ఎమ్మెల్యేలు రావడం జరిగింది. నిన్న లగచర్ల ఘటనపై చర్చకు అనుమతించకపోవడంతో నిరసన తెలియజేస్తూ బ్లాక్ షర్ట్ లతో అసెంబ్లీకి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఈ తరునంలోనే… అసెంబ్లీలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు వినూత్న నిరసన చేపట్టారు. చేతులకు బేడీలు వేసుకొని నిరసన తెలిపారు బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు.
నల్ల చొక్కాలు ధరించి నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం లాటి రాజ్యం లూటీ రాజ్యం… రైతులకు బేడీల సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేస్తూ… నిరసనకు దిగారు BRS ఎమ్మెల్యేలు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద గౌడ్ మాట్లాడారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన పేరును బాంబులేటి శ్రీనివాస్ రెడ్డి గా మార్చుకోవాలని చురకలు అంటించారు. కేటీఆర్ ను ఫార్ములా ఈ రేస్ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
లగచర్ల రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ.. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వినూత్న నిరసన.
చేతులకు బేడీలు వేసుకొని, నల్ల దుస్తులు ధరించి నినాదాలు చేస్తూ నిరసన. pic.twitter.com/0darVWf0vo
— Mission Telangana (@MissionTG) December 17, 2024