BRS ఎమ్మెల్సీ కవిత శాసనమండలి మీడియా పాయింట్ వద్ద కీలక కామెంట్స్ చేసారు. మూసి ప్రాజెక్టు పై మెం అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం దాటవేసే ధోరణి అవలభిస్తుంది. 4100 కోట్లు కావాలని ప్రపంచ బ్యాంకును ప్రభుత్వము ఆశ్రయించినట్లు నిర్ధిష్టమైన సమాచారం ఉంది మాకు అని ఆమె తెలిపారు. ఇక ప్రపంచ బ్యాంకును ప్రభుత్వం ఆశ్రయించిన విషయం వాస్తవమా కాదా ప్రభుత్వం చెప్పాలి అని ప్రశ్నించారు.
అలాగే డీపీఆర్ తయారు కాలేదని ప్రభుత్వం ఈ రోజు సభకు చెప్పింది. ప్రజలకు పునరావసం కల్పించిన తరువాత ప్రాజెక్ట్ పనులు ప్రారంభించాలి. మూసి సుందరికరణకు పేదల ఇల్లు పోతాయిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపేశారు. ఎస్టీపిలు ఏర్పాటు చేసి మంచి నీటితో మూసిలో పారించాలని భవించాము. అయితే మూసి ప్రాజెక్టుకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు అని పేర్కొన కవిత.. మూసి పరివాహక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగిన బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుంది అని స్పష్టం చేసారు.