పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ ముట్టడించారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి అరెస్ట్ నిరసిస్తూ పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ ముట్టడించారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. దీంతో పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇలా ఉండగా..గూడెం మధుసూదన్ రెడ్డి అరెస్ట్ పై మహిపాల్ రెడ్డి కూడా ఫైర్ అయ్యారు.
2011-12 లో క్వారీ లీజుకు తీసుకున్నామని… గత నాలుగేళ్లుగా మేము సొంతంగా సంతోష్ క్రషర్లు కంపెనీ పేరుతో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మేము తప్పు చేసినట్టు రుజువు అయితే ఫెనాల్టీ వేయండి….కానీ తెల్లవారుజామున 3 గంటలకు వందల మంది పోలీసులు వచ్చి అక్రమ అరెస్టులు చేశారని ఆగ్రహించారు. కాంగ్రెస్ వచ్చిన 100 రోజుల్లో BRS ఎమ్మెల్యేలు, నేతలపై కేసులు పెడుతున్నారని ఆగ్రహించారు. పటాన్ చెరులో 40 క్రషర్లు ఉన్నాయి..అందులో చాలా వాటికి లైసెన్స్ అయిపోయిన నడుస్తున్నాయని వివరించారు. మా దగ్గర ఆధారాలతో క్వారీకి సంబంధించిన అన్ని పర్మిషన్లు ఉన్నాయన్నారు మహిపాల్ రెడ్డి.