రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. బీఆర్ఎస్ పార్టీ ఈనెల 21న తలపెట్టిన రైతు మహాధర్నాను ఉదయం 10 గంటల నుంచి నల్గొండ గడియారం సెంటర్ లో నిర్వహిస్తున్నట్టుగా స్థానిక మాజీ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు. ఈ ధర్నాకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని వెల్లడించారు.
మోసపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని భూపాల్ రెడ్డి విమర్శించారు. ముఖ్యంగా రైతులను తప్పుడు వాగ్దానాలతో మోసం చేస్తున్నదని రైతు రుణమాఫీ కేవలం 35 శాతం మందికీ మాత్రమే మాఫీ చేసి చేతులు దులుపుకుందని రైతు భరోసా కూడా అనేక ఆంక్షలు పెట్టి.. ఎకరానికి రూ.15వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు రూ.12వేలు ఇస్తామంటున్నారని రూ.500 బోనస్ నామమాత్రమైందని 24 గంటల కరెంట్ రావడం లేదన్నారు.