తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మేడిగడ్డ చుట్టూ రాజకీయాలకు సాగుతున్నాయి. భారీ వరదలు వచ్చినా కూడా మేడిగడ్డ నిలవడంతో… గులాబీ నేతలు అలర్ట్ అయ్యారు. వెంటనే కాలేశ్వరం పర్యటనకు గులాబీ నేతలు పయనమయ్యారు. నిన్న కరీంనగర్ లోని మిడ్ మానేరు సందర్శించిన కేటీఆర్ బృందం.. ఇవాళ కాలేశ్వరం ప్రాజెక్టుకు చేరుకోనుంది.
ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం.. తొమ్మిదిన్నర గంటలకు కన్నెపల్లి పంప్ హౌస్ కు చేరుకుంటారు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు. అనంతరం ఉదయం పదిన్నర గంటలకు మేడిగడ్డ సందర్శనకు వెళ్తారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఉండనుంది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మీడియా సమావేశం ఉండే ఛాన్స్లు ఉన్నాయి.
హరీష్ రావు అలాగే కేటీఆర్ మాట్లాడే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి హైదరాబాద్కు గులాబీ పార్టీ నేతలు తిరుగు ప్రయాణం అవుతారు. అయితే ఇవాళ మేడిగడ్డకు గులాబీ పార్టీ నేతలు చేరకుండా… రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆంక్షలు వేసే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ గులాబీ నేతలు అక్కడికి వెళ్తే… కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారం.. బయటపడే ఛాన్స్ ఉంది. అందుకే ఇలా వ్యవహరించబోతున్నారని సమాచారం.