ఏపీలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత…రకరకాల పథకాలను తీసుకువస్తోంది.ఏపీ ప్రజలకు న్యాయం చేసేలా ముందుకు అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రస్తుతం ఏపీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే ఏపీలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా చంద్రబాబు ప్రభుత్వం కీలక ప్రకటనలు చేస్తోంది.
అయితే.. ఏపీలో ఉన్న రైతులకు తాజాగా అదిరిపోయే శుభవార్త అందించారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. పాల దిగుబడి పెంచడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఆయనే ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా పాల దిగుబడి పెంచే దిశగా… చర్యలు తీసుకునేందుకు ఊరూర పశుగ్రాస క్షేత్రాలు అన్ని గ్రామాల్లో ప్రారంభించాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు మంత్రి అచ్చం నాయుడు.
గతంలో ఈ పథకాన్ని అమలు చేశామని.. కానీ జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని మొత్తం ఆపేసారన్నారు. ఈ పశుగ్రాసం పెంపకంలో భాగంగా… చిన్న అలాగే సన్న కారు రైతులు ఉన్న పొలంలో కనీసం 25 గుంటల నుంచి మూడు ఎకరాల వరకు పశుగ్రాసాన్ని పెంచేలా ఆర్థిక సహాయం అందిస్తామని కూడా… వివరించారు. రెండు సంవత్సరాల పాటు ఒక ఎకరానికి… దాదాపు లక్ష రూపాయల వరకు సహాయం అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. రైతులకు మేలు చేసే దిశగా అడుగులు వేస్తామని తెలిపారు.