బీఆర్ఎస్ ఇవాళ అసెంబ్లీ టికెట్లు ప్రకటించనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పార్టీ కేడర్‌ను బలపరుచుకోవడంపై ఫోకస్ పెట్టాయి ప్రతిపక్షాలు. ఎలాగైనా ఈసారి బీఆర్ఎస్ను గద్దె దించాలన ప్రయత్నంలో ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నాయి.
మరోవైపు ఈసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఈ క్రమంలోనే ఆ దిశగా చర్యలు వేగవంతం చేసింది. అయితే.. BRS ఇవాళ విడుదల చేసే జాబితాలో ఆసిఫాబాద్ లో ఆత్రం సక్కు స్థానంలో కోవా లక్ష్మి, ఖానాపూర్ లో రేఖా నాయక్ బదులు జాన్సన్, బోధ్ లో అనిల్ జాదవ్/నగేష్, వైరాలో రాములు నాయక్ స్థానంలో మదన్ లాల్, వేములవాడలో రమేష్ స్థానంలో లక్ష్మీనరసింహారావు, జనగామలో ముత్తిరెడ్డి స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి/శ్రీనివాస్ రెడ్డి, స్టేషన్ గన్ పూర్ లో రాజయ్య స్థానంలో కడియం పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.