సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విజయం సాధించింది బీఆర్ఎస్ పార్టీ. సుమారు 111 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థిపై బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి గెలిచినట్లు సమాచారం.
ఇక దీనిపై మరికాసేపట్లోనే అధికారిక ప్రకటన రానుంది. దీంతో బీఆర్‌ఎస్ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.
- మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం.. సీఎం రేవంత్ రెడ్డికి సొంత జిల్లాలో ఎదురుదెబ్బ. 108 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపు.. మొదటి ప్రాధాన్యత ఓట్లలోని గెలిచి సంబరాలు చేసుకుంటున్న బీఆర్ఎస్ శ్రేణులు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ