దుబాయ్ అంటే పెద్ద భవనాలే…బొద్దింకలు కూడా తిరుగుతాయన్నారు కేటీఆర్. మేక బ్రతుకు పుస్తకాన్ని ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…అనంతరం మాట్లాడారు. గల్ఫ్ దేశాల్లో వలసదారుల బ్రతుకులు చాలా దారుణంగా ఉంటాయని చెప్పారు. దుబాయ్ అనగానే అందరికి పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద రోడ్లు, బుర్జ్ ఖలీఫాలు కనిపిస్తాయి కానీ ఆ దుబాయ్ పక్కనే డేరా అనే ప్రాంతంలో డార్మెంట్రి రూంలో ఎంతో మంది పడుకుంటారని వివరించారు.
నేను అక్కడికి వెళ్ళినప్పుడు కింద కూర్చుంటే బొద్దింకలు తిరుగుతున్నాయి, అక్కడే వాళ్లు తింటున్నారు.. వారంలో పని ఉంటే ఏడు రోజులు పని చేపించుకుంటున్నారన్నారు కేటీఆర్. వలస రెండు రకాలు.. విదేశాలకు వలస వెళ్ళడం. స్వదేశంలో నగరాలకు వలస వెళ్ళడం అని తెలిపారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి విదేశాలకు వలస వెళ్లిన వాళ్లకు వలస ఆశల తోరణం.. వాళ్లు వెనక్కి తిరిగి చూసేది ఉండదు, వాళ్ల జీవితంలో ఒక మెట్టు ఎక్కినట్టేనని వివరించారు కేటీఆర్.