రాచకొండ ప్రాంతంలో మరో ఫిల్మ్ సిటీ వస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో మరో కొత్త నగరం నిర్మిస్తానని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. న్యూయార్క్ నగరంతో పోటీ పడేలా హైదరాబాద్లో మరో కొత్త నగరం నిర్మిస్తానని వెల్లడించారు రేవంత్ రెడ్డి. సైబరాబాద్ తరహాలో హైదరాబాద్ లో మరో కొత్త నగరాన్ని నిర్మిస్తానని తెలిపారు. న్యూయార్క్ నగరంతో పోటీ పడేలా మహేశ్వరంలో ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చారు.
రాచకొండ ప్రాంతంలో మరో ఫిల్మ్ సిటీని కూడా అందుబాటులోకి తెస్తానని వెల్లడించారు. బాలీవుడ్ నటులు కూడా ఇక్కడకు వచ్చి షూటింగులు చేసేలా ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో ఆర్ఆర్ఆర్ వస్తే.. నగరమంతా ఇంకా అభివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. రియల్ ఎస్టేట్ పెరగడం వల్ల తాటి వనాలు తగ్గుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వన మహోత్సవంలో భాగంగా తాటి చెట్ల పెంపకాన్ని పరిశీలిస్తామన్నారు. రోడ్ల పక్కన వీటిని నాటాలనే నిబంధన విధిస్తామని పేర్కొన్నారు.