తెలంగాణలో బీఆర్‌ఎస్ నేతల అరెస్ట్ అవుతున్న తరుణంలోనే.. కొచ్చికి వెళ్లారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేరళలోని కొచ్చిలో జరుగుతున్న టైకాన్ కేరళ 2024 కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈరోజు ఉదయం కొచ్చికి వెళ్లారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడేంట్ కేటీఆర్. దీంతో… బీఆర్‌ఎస్ నేత కౌశిక్ రెడ్డి ఇంటికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్….ఇంటికి వెళ్లలేకపోయారు.
కానీ తెలంగాణలో బీఆర్‌ఎస్ నేతల అరెస్ట్ పై కేటీఆర్ స్పందించారు. సూటుకేసులు మీకు .. అరెస్టులు మాకు అంటూ కేటీఆర్ సంచలన పోస్ట్ చేశారు. ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు… పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు… పాలనలో లోపాలను గుర్తు చేస్తే కేసులు అంటూ ఆగ్రహించారు కేటీఆర్. గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తే కేసులు… ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరిస్తే కేసులు అంటూ ఆగ్రహించారు.